ప్రాథమిక పాఠశాలలో గణిత మేధావి రామానుజన్ వేడుకలు
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 22,
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ ప్రాథమిక పాఠశాలలో గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ 136 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.మానవ మనుగడకు ఆయన చేసిన సేవలు అమోఘమని ప్రధానోపాధ్యాయుడు మహాదేవుని భాస్కర్ అన్నారు.ఎంపియుపిఎస్ వన్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా రామానుజన్ జయంతిని పురస్కరంచుకుని విద్యార్థులు స్వయంగా గణిత శాస్త్ర ప్రాజెక్టులు తయారుచేసి ప్రదర్శించారు.ఉత్తమంగా తయారు చేసిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు మహాదేవుని భాస్కర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయురాలు బి.మంజుల మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శ్రీనివాస రామానుజన్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.విద్యార్థులు చిన్నప్పటి నుంచే గణిత శాస్త్రంపై ఆసక్తి పెంచుకోవాలని,ప్రపంచం గర్వించదగ్గ మహా మేధావి శ్రీనివాస రామానుజన్ అని మానవ మనుగడ గణిత శాస్త్రంపై ఆధారపడి ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,ఆర్.రేణుక,ప్రభావతి,బి.గీతామాధురి,సిహెచ్.శ్వేత,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.