అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం.

అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం.

ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి .

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి

సూర్యాపేట రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఆరోపించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహ రెడ్డి భవన్ లో జరిగిన ఐద్వాసూర్యాపేట జిల్లా వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై ధరలబారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని మూలంగా మహిళలు సరైన పోషక ఆహారా పదార్థాలు తీసుకోకపోవడంతో రక్తహీనతతో బాధపడుతున్నారని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 16 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని కోరారు. పౌష్టిక ఆహారం లేకపోవడం మూలంగా పిల్లలలో ఎదుగుదల లోపం ఉందన్నారు. దేశంలో చిన్నారుల ఎదుగుదల రేటు35.5 శాతంగా ఉందన్నారు. ఐదు సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో2.9 శాతం మంది మృత్యువాత పడుతున్నారని అన్నారు. ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో సంపద కొద్దిమంది చేతుల్లో కీ పోతుందని అన్నారు. మూడు పూటలు భోజనం తినని కుటుంబాలు దేశంలో లక్షలాదిగా ఉన్నాయన్నారు. అనేకమంది వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెట్ కు సరుకులను తరలిస్తున్నారని వాటిని వెలికి తీసి పేదలందరికీ పంచాలని కోరారు. పాలకులు విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా మహిళలపై, విద్యార్థులపై, యువతి లపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలను అరికట్టడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు గోరంగా వైఫల్యం చెందుతున్నాయని విమర్శించారు. అనేక చట్టాలు వచ్చినప్పటికీ మహిళలపై జరుగుతున్న దాడులు హింస తగ్గడం లేదని చట్టాలను సమర్థవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. అనంతరం ఐద్వా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో కుమ్మరి బజార్ లో మహిళలు ఎదుర్కొంటున్న అధిక ధరల భారంపై సర్వే నిర్వహించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగెళ్ల వెంకట చంద్ర అధ్యక్షతన జరిగిన ఈ వర్క్ షాప్ లో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి , జిల్లా నాయకురాలు మేకన బోయిన సైదమ్మ, జూలకంటి విజయలక్ష్మి, అందం నారాయణమ్మ, ఇంద్రియాల త్రివేణి, సుందరి రమాదేవి, నెమ్మాది లక్ష్మి, తుమ్మజడ వెంకట కోటమ్మ, ములకలపల్లి ఝాన్సీ, ఆది మల్ల సునీత, పిండిగా నాగమణి, లక్ష్మి ,ఎల్లమ్మ, ప్రమీల, సరిత, ఆవుదొడ్డి భాగ్యమ్మ, ప్రవళిక, కొప్పుల రజిత తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment