-కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డి
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 19,
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట గ్రామంలో గురువారం నాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఎంబరి రామచంద్రం కూతురు ఎంబరి మమత కుటుంబ సభ్యులకు 39 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేశారు.ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నివర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలవారీగా నెరవేరుస్తూ,ప్రజా మన్నన పొందుతున్నాడని,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవెస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారం రెడ్డి,యువకులు నరేష్,గ్రామస్థులు తదితరులు ఉన్నారు.