బిజెపి బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి అని చింతల ఎల్లేష్ యాదవ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 19;
బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని ఆ పార్టీ చౌటుప్పల్ మండలం కార్యదర్శి చింతల ఎల్లేష్ యాదవ్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రామంలోని 69,70,71వ బూతులకు గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. 69వ బూత్ అధ్యక్షులుగా బండారు శివ, కార్యదర్శిగా పొంతల మాణిక్యరావు, 70వ బూత్ అధ్యక్షులుగా జొన్నగంటి సురేందర్ రెడ్డి, కార్యదర్శిగా కంచర్ల రవికాంత్ రెడ్డి, 71 వ బూత్ అధ్యక్షులుగా పక్కీరు ప్రభాకర్ రెడ్డి,కార్యదర్శిగా ఎల్లంకి వంశీ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన బూత్ కమిటీలను మండల అధ్యక్షులు చినుకని మల్లేష్ యాదవ్, కైరంకొండ అశోక్ , ఉబ్బు బిక్షపతి,మండల కార్యదర్శి చింతల ఎల్లేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ ఈడ్దుల ఐలయ్య యాదవ్ లు సన్మానించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎల్లంకి శివ, ఈడుదుల శివ, అమరేందర్ రెడ్డి, సిలువేరు భాస్కర్, మన్నే అఖిల్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, మల్లేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.