సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభ

గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్

సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ జీవితంలో ఉత్తమ క్రమశిక్షణకు ఆటలు ప్రధానమని,గ్రామస్థాయి నుండి ఒలంపిక్ స్థాయి వరకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యా,వైద్యం పై ప్రత్యేక శ్రద్ధ కనపరచి ప్రథమ ప్రాధాన్యతగా ఆ రంగాలను అభివృద్ధి చేస్తామని,పాఠశాల స్థాయిలో గ్రామస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్న మన దృష్టికి తీసుకురావాలని సమస్యలను పరిష్కారం చేస్తామని తెలిపారు.అనంతరం మండల నాయకులతో కలిసి మండల వనరుల కేంద్రాన్ని సందర్శించారు.ఎంఈఓ వెంకట్ రాములు తెలిపిన సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ప్రక్కనే ఉన్న మండల కేజీబీవీ పాఠశాలను సందర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పాఠశాల ఆవరణలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.పాఠశాలలోని విద్యార్థులకు పెట్టేటటువంటి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు.మండల స్థాయి ఆటల పోటీలలో గెలుపొందిన వాలీబాల్ విన్నర్ మర్కుక్ టీమ్,రన్నర్ శివార్ వెంకటాపూర్,కబడ్డీ విన్నర్ పాములపర్తి టీమ్,రన్నర్ కాశిరెడ్డి పల్లి టీమ్,ఖో ఖో విన్నర్ యూసఫ్ఖాన్ పల్లి టీమ్,రన్నర్ భావనందాపూర్ టీమ్ నిలబడ్డాయి.గెలుపొందిన వారికి బహుమతులు మాజీ ఎంపీటీసీ తుమ్మ కృష్ణ,ఎంఆర్ ఓ ఆరిఫా,ఎంపి డిఓ అబ్జాలుద్దీన్,ఎంఈ ఓ వెంకట్ రాములు,మర్కుక్ ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ ఆటల పోటీలో పాల్గొన్న వారికి ఫుడ్ స్పాన్సర్ మల్లేష్ గౌడ్,బహుతుల స్పాన్సర్ తుమ్మ కృష్ణ కు క్రీడాకారులు ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో మర్కుక్ ఎస్సై దామోదర్,స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశం,పిఆర్ టియు ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరావు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బబ్బూరి మల్లేషo గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కనకయ్య గౌడ్,ఉపాధ్యక్షుడు ర్యాకం యాదగిరి,గ్రామ శాఖ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి,సీనియర్ నాయకులు సుగుణాకర్ రెడ్డి,శేఖర్ రెడ్డి,పాతూరు మాజీ సర్పంచ్ అరుణ నర్సిములు,మాజీ ఉపసర్పంచ్ పద్మ నర్సింలు,మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్యాంప్రసాద్,క్రాంతి కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు,వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు. end

Join WhatsApp

Join Now

Leave a Comment