సిఎం,మినిస్టర్స్ కప్ 2024  ఆటల పోటీలు ప్రారంభం 

సిఎం,మినిస్టర్స్ కప్ 2024 

ఆటల పోటీలు ప్రారంభం 

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్

సీఎం కప్ క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన జిల్లా యువజన క్రీడల అధికారి జి రామచంద్రరావు. మంగళవారం సీఎం కప్ 2024 జిల్లా పోటీలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు లాంచనంగా రెండో రోజు క్రీడలను ప్రారంభించారు. జిల్లా స్థాయిలో 16- 12 -2024 నుండి 21 -12 -2024 వరకు క్రీడలు నిర్వహించడం జరుగుతుందని డివైఎస్ఓ తెలిపారు. కబడ్డీ, బాస్కెట్బాల్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల మైదానంలో బ్యాట్మెంటన్ ఎస్ వి డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కబడ్డీ పోటీలకు బాయ్స్ అండ్ గర్ల్స్ 56 టీములు, బాస్కెట్బాల్, షటిల్ కొరకు 102 మంది క్రీడాకారులు. మొత్తం 675 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని డివైస్ ఓ జి రామచంద్ర తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ అజీమ్ బాబా, పిటి అధ్యక్షులు మల్లేష్, సెక్రటరీ శ్రీనివాస్ ,టీజీపీఈటి అధ్యక్షులు రామ్మోహన చారి, సెక్రటరీ సీతారామరెడ్డి, భాస్కేట్ బాల్ జిల్లా అసోసియేషన్ సెక్రటరీ ఎస్.కె ఫారుక్, అసిస్టెంట్ ఎస్జిఎఫ్ సెక్రటరీ క్రీడాకారులు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment