---Advertisement---

*విజయవంతంగా సిఎం టూర్*

---Advertisement---

*విజయవంతంగా సిఎం టూర్*

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 25:

ప్రత్యేక విమానం ద్వారా ఏడుపాయలకి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రెవిన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
పి. సి.సీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఘనంగా స్వాగతం పలికిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే, సంజీవరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అనంతరం పూర్ణ కుంభం తో స్వాగతం పలికి గర్భ గుడిలోకి తీసుకెళ్లిన ఆలయ పూజారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్గ భవాని మాత కు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి ఆలయ పూజారుల ఆశీర్వాదంతీసుకున్నారు.తర్వాత 750 కోట్ల పైచిలుకు రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి మెదక్ చర్చికి బయలుదేరారు.ఏడుపాయలలో శంకుస్థాపన చేసిన పనుల వివరాలు.
మెదక్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ..750 .కోట్ల పైచిలుకు విలువైన పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల లో శంకుస్థాపన.మెదక్ ఇందిరా మహిళా శక్తి భవనం 5 కోట్లు.ఏడుపాయలలో బీ టీ రోడ్డు, డివైడర్, హై మాస్ట్ లైట్ల ఏర్పాటు కోసం రూ.35 కోట్లు.గిరిజన తండాలకు రూ.45.32 కోట్లతో రోడ్ల నిర్మాణం.అర్అండ్ బీ రోడ్ల నిర్మాణం పనుల కోసం రూ.7.44 కోట్లు.
శతాబ్ది వేడుకలు జరుపుకుంటున్న మెదక్ చర్చికి సుమారుగా 29.1850 కోట్లరూపాయలు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్కూల్.203కోట్లు.
స్వయంసహాయక గ్రూప్ లకు బ్యాంకు లింకేజ్ కోసం 100 కోట్ల రూపాయల చెక్కును ముఖ్య మంత్రి అందచేసారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment