సి‌ఎం‌ఆర్ బియ్యం డెలివేరి

సి‌ఎం‌ఆర్ బియ్యం డెలివేరి

వేగం పెంచాలని అదనపు కలెక్టర్ నగేష్ రైస్ మిల్లర్స్ ను ఆదేశించారు.

 

శనివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సి‌ఎం‌ఆర్ బియ్యం డెలివేరి పురోగతి పై జిల్లాలని రైస్ మిల్లర్స్ తో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 28:

 

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మిల్లర్లు వానాకాలం 2023-24 బియ్యం డెలివేరిని ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపల 100 శాతం పూర్తి చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.యాసంగి 2023-24 సీజన్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి 2,52,013 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలోని 67 రైస్ మిల్లులకు కేటాయించటం జరిగిందని, ఇందుకు గాను 1,70,856 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది అని తెలిపారు. ఇందులో ఈ రోజు నాటికి 99,339 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి మిల్లర్లు అందజేశారని, ఇప్పటికే 58% టార్గెట్ పూర్తి చేశారని, మిగిలిన 42% టార్గెట్ పూర్తి చేయటానికి 71,517 మెట్రిక్ టన్నుల బియ్యం గడువులోపల ప్రభుత్వానికి అందజేయాలని రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు గాను ప్రభుత్వం 25-జనవరి, 2025 నాటికి 100% టార్గెట్ పూర్తి చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.ఈ సమావేశం లో జిల్లా మేనేజర్, పౌర సరఫరాల హరికృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేశ్ రెడ్డి, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రపాల్, జిల్లా రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment