ప్రభుత్వ,సంక్షేమ,రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణలో. అధికారులకు చిత్తశుద్ధి అవసరం అని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 10:
మంగళవారం ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్వహణ, పాఠశాలలో సెప్టిక్ ట్యాంక్స్ , మరుగుదొడ్లు మరమ్మత్తులు డోర్స్ ప్రతిపాదన సిద్ధం చేయడం, సంబంధిత విషయాలపై జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్, మైనార్టీ సంక్షేమ అధికారి జామ్లా నాయక్,ఈ. ఈ పంచాయతీరాజ్ నరసింహులు సంబంధిత ఆర్సిఓలు, ప్రిన్సిపల్స్ తో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ,సంక్షేమ,పాఠశాలల్లో నూతన మెనూ అమల్లోకి తీసుకురావాలని, పాఠశాలల్లో సెప్టిక్ ట్యాంక్, మరుగుదొడ్లు, డోర్స్ మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేసి సంబంధిత హెచ్ ఓ డి లకు అందజేయాలన్నారు. వంట చేయడం,వడ్డించడం, వంట పాత్రలు పరిశుభ్రత, స్టోర్ రూమ్ మెయింటెనెన్స్ సంబంధిత విషయాలపై సిబ్బందికి గూగుల్ మీట్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.ఈ మూడు రోజులు వ్యవధిలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ, సంక్షేమ,ఆశ్రమ పాఠశాలల్లో నిర్వహణలో ఆహారం నాణ్యత లోపించి ఏ ఒక్కరికి హాని జరిగిన సహించేది లేదన్నారు. ఫుడ్ పాయిజింగ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాకుండా చూడాలన్నారు. పాఠశాల నిర్వహణ బాధ్యతగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత. అధికారులు తదితరులు పాల్గొన్నారు.