లింగమంతుల జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష .

లింగమంతుల జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష .

 

లింగమంతుల స్వామి జాతర ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

తెలంగాణ కెరటం ; సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 18 బుధవారం ఉదయం సూర్యాపేట 5 వార్డులోని లింగమంతుల స్వామి దేవాలయాన్ని ఆదనవు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2025 సంవత్సరంలో జరుగు లింగమంతుల స్వామి జాతర ఫిబ్రవరి 2 తారీఖు దిష్టి పూజ నిర్వహిస్తారని, ఫిబ్రవరి 16, 17, 18, 19 ,20, తేదీలలో జాతర నిర్వహించబడుతుందని కలెక్టర్ తెలిపారు. జాతర ఏర్పాట్ల కొరకు ప్రతి కార్యక్రమానికి ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని, అధికారులు జాతర సజావుగా నిర్వహించడానికి కావలసిన పనుల అంచనా విలువలను సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జాతర జరుగు అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ఉండాలని ,పర్యవేక్షణకు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్ గుడి పైన క్రింద ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ పబ్లిక్ ఎటస్టెషన్ సిస్టం ఏర్పాటు చేయాలని చెప్పారు. జాతరలో పనిచేసే సిబ్బంది అందరికీ పాసులు ఉండాలని కలెక్టర్ తెలిపారు. వాలంటీర్స్ అందరికీ పోలీస్ అప్రూవల్ కార్డ్స్ ఉండాలని తెలిపారు. దేవాలయం వద్ద ప్రోటోకాల్ కొరకు ఒక అధికారిని నియమించాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రత్యేక అధికారులు వచ్చినప్పుడు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కొరకు ఒక అధికారి నియమించాలని తెలిపారు. డ్రింకింగ్ వాటర్ నిరంతరంగా ప్రజలకు అందేలా ఏర్పాట్లు ఉండాలని డ్రింకింగ్ వాటర్ వద్ద సోప్ పీట్స్ సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ పరంగా టెంపుల్ ఏరియా , చుట్టూ ఉన్న భూములకు సంబంధించిన మ్యాప్ ను సిద్ధం చేయాలని తెలిపారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో పార్కింగ్, ప్రదేశాలు ఎగ్జిబిషన్ ప్రదేశాలు భోజనాలు చేయు ప్రదేశాలను గూగుల్ స్కెచ్ తయారుచేసి అందించాలని తెలిపారు. గుడి పైన ఏర్పాట్లను దేవాదాయ శాఖ ,గుడి కింద ప్రాంతాలను మున్సిపల్ అధికారులు ఏర్పట్లు పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు ఆర్ అండ్ బి అధికారులు గుడి పక్కన గల కోనేరుకు, గుడి చుట్టూ ఉన్న రహదారులకు బారికేట్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దేవాలయం పైన జాతర చుట్టుపక్కల రహదారులకు సుందరీకరణ చేయాలని, కోనేరు వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రాంతాలలో సెక్యూర్ లైటింగ్ ఉండాలని తెలిపారు. ప్రాంతాలవారీగా ,ప్రదేశాల వారీగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. జాతర జరుగు సమయంలో ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుటకు పారిశుధ్య కార్మికులు పైన దేవాదాయ శాఖ వారు, గుడికి క్రింద మున్సిపల్ మరియు ఎంపీడీవోలు చూడాలన్నారు. జాతర కు వచ్చు అన్ని రహదారులను పంచాయతీరాజ్ శాఖ అధికారులు పరిశీలించి సిద్ధం చేయాలన్నారు. దేవాలయం వద్ద గుడి పైన హెల్త్ క్యాంప్ గుడి క్రింద భాగంలో కూడా ఒక హెల్త్ క్యాంపు ఏర్పాటు , ఎపడమిక్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు తేలిపారు. దేవాలయానికి, పరిసర ప్రాంతానికి మంచి రంగులు వేయాలని అలాగే గుడి పైన జాతర గుర్తుగా బెలూన్ ప్రదర్శించాలన్నారు. గుడి పైన చలవ పందిళ్లు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు కలెక్టర్ తెలిపారు. లింగమంతుల స్వామి జాతర విజయవంతం కావడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకిడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏ సులోచన, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఐదవ వార్డు కౌన్సిలర్ భాష, డిఎస్పి రవి, ఈవో కుశలయ్య, ఆలయ పూజారులు శ్రీశైలం ,శ్రీను ,తాసిల్దార్ కృష్ణయ్య, ఆర్ ఐ శ్రీధర్, మిషన్ భగీరథ అధికారులు ఇంట్రా శ్రీనివాస్ ,గ్రిడ్ అధికారి అరుణాకర్ రెడ్డి, ఏమ్ పి డి ఓ. లు, అధికారుల సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment