ఆర్డీఓ,సఖి,ఎస్వీ కాలేజీలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన .

ఆర్డీఓ,సఖి,ఎస్వీ కాలేజీలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన .

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్

. ధరణి పెండింగ్ ధరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట ఆర్.డి.ఓ. కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఆర్ డి ఓ కార్యాలయంలోని ఎలక్షన్ సెల్ ని పరిశీలించి సిబ్బంది కి ఫారం -6,7,8 లపై పలు సూచనలు చేశారు. అలాగే రికార్డ్ గదిని పరిశీలించారు.సిబ్బంది అందరు సమయపాలన పాటించాలని,ధరణి పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు.తదుపరి కేంద్రీయ విద్యాలయ కేంద్రం సూర్యాపేట లో ఏర్పాటు చేయుట కొరకు తాత్కాలిక బిల్డింగ్ ని ఎస్ వి డిగ్రీ కళాశాల నందు జిల్లా కలెక్టర్ పరిశీలించారు.అనంతరం సఖి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా సఖి కేంద్రం ద్వారా ఇప్పటి వరకు ఎన్ని గృహహింస కి గురైన మహిళలకి సంబందించిన కేస్ లు నమోదు అయినాయి, ఎంత మందికి న్యాయ సలహాలు అందించారో సిబ్బంది ద్వారా తెలుసుకొని రిజిస్టర్ ని పరిశీలించారు.హెల్ప్ లైన్ నెంబర్ 181ద్వారా ఇప్పటి వరకు 1062 కాల్స్ రాగా 197 కేస్ లు నమోదు చేయటం జరిగిందని,148 కేస్ లు పరిష్కరించామని మిగిలిన 49 కేసులు వివిధ దశలలో విచారణ చేయటం జరుగుతుందని తెలిపారు. అలాగే సఖి కేంద్రం ద్వారా 1288 కేస్ లు నమోదు అవ్వగా 981 కేసులు పరిష్కరించటం జరిగిందని 307 కేసు లు వివిధ దశలలో విచారణలో ఉన్నాయని తెలిపారు.సఖి కేంద్రానికి వివిధ కారణాలతో వచ్చే మహిళలకి స్కిల్ సెంటర్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో ఆర్ డి ఓ వేణు మాధవ్ , ఎస్ వి కాలేజీ ప్రిన్సిపాల్ వెంకటేష్ లు , సఖి కేంద్రం పరిపాలన అధికారి శైలజ, కేస్ వర్కర్ సుజాత, పారామెడికల్ సిబ్బంది మానస, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment