*బస్టాండ్ లేవి బాల్కొండ ముఖ్య మంత్రికి ఫిర్యాదు*
*పేరుకే బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గం*
తెలంగాణ కెరటం నిజామాబాద్ జిల్లా ప్రతినిధి 22.
బాల్కొండ పేరుకే అసెంబ్లీ నియోజక వర్గం బాల్కొండ లో బస్టాండ్ లేదని అల్ల కొండ ఖిల్లా పరిరక్షణ సమితి కార్యనిర్వహక అద్యక్షులు బి.ఆర్.నర్సింగ్ రావు 23-12-2024 సాయంత్రం 3:45 లకు బాల్కొండ బస్టాండ్ పునరుద్ధరణ & బస్టాండ్ స్థితి గతుల విషయమై వివరణ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఏం.డి.గౌ,,సజ్జ నర్,. ఐపిసి సుదీర్ఘ రిపోర్ట్ తో పాటు వివిధ పత్రికల్లో వచ్చిన వేత్తలు జత చేసి ఇవ్వడం జరిగింది.ఇదే విషయం గురించి రాష్ట్ర ముఖ్య మంత్రి కార్యాలయంలో ఈ నెల 20 సమర్పించిన వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు.బాల్కొండ నుండి
ఏం.యెల్.ఏ బాల్కొండ ఏం.యెల్.ఏ కె.ఆర్.సురేష్ రెడ్డి హయంలో తేది 25-02-1991 (33 సంవచ్చా రాల క్రితం) మాజి రోడ్లు భవనాలు శాఖ మంత్రి ఏస్.సంతోష్ రెడ్డి బస్ స్టాండ్ ప్రారంభించిన నాటి నుండి ఇప్పటివరకు బస్టాండ్ లోకి బస్సులు రాకపోకలు జరగక పోవడంతో బస్టాండ్ పశువుల కొట్టంగా,రాత్రుల్లో విటులకు, ప్రేమికుల మంచి అనువుగా మారిందని ఇంతవరకు బస్టాండ్ లేదని ప్రజలు ప్రయాణికులు బస్సుల కోసం జాతీయ రహదారి పైనే నిల్చుండి బస్సుల కొరకు గంటల తరబడి వేచి చూడవలసిందే నని ఈ విషయం గురించి ఏ పార్టీ నాయకులు పట్టించు కోవడం లేదని నర్సింగ్ రావు అవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతము నిజామాబాద్ ఆర్మూర్, హైదరాబాద్ నుండి వచ్చిన బస్సులు జాతీయ రహదారిపైనే ప్రయాణికులని దించేసి వెళ్తూ ఉంటారు,అలాగే ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతాల నుండి ప్రాంతాల నుండి వచ్చిన బస్సులు ప్రయాణికులను కూడా ఇదే జాతీయ రహదారిపై దించేసి వెళుతూ ఉంటాయి.కానీ ప్రయా ణికులు కూర్చోవడానికి రోడ్డు పైన బెంచీలు, షెల్టర్ గాని లేదు.దూర ప్రాంతా లకు వెళ్లే ప్రయాణికులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చాలా ఇబ్బందు లకు గిరౌతున్నారని ఆయన వివరించారు.తెలంగాణ ముఖ్య మంత్రి ప్రత్యెక చొరవ తీసుకొని నిజామాబాద్ హైదరాబాద్ ఆర్మూర్ నుండి వచ్చే బస్సులు బాల్కొండ నెహ్రు నగర్ బైపాస్ “బ్రిడ్జి పైనుండి కాకుండా” నేషనల్ హైవే అథారిటీ వారు నిర్మించిన “సబ్ వే” రోడ్డు ద్వారా నెహ్రూ నగర్ బ్రిడ్జి వద్ద బస్సులు ఆపి ప్రయాణికుల్ని దించి వేస్తే ఎన్టీఆర్ నగర్ నెహ్రూ నగర్ బాల్కొండ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే అదిలాబాద్, నిర్మల్ నుండి బాల్కొండ కు వచ్చే బస్సులు 1991లో (33 సంవచ్చా రాల క్రితం) లో నిర్మించిన బస్టాండ్ ముందు ముందు ప్రయాణికులు దించేస్తే చాలా అనుకూలంగా ఉంటుందని కావున ముఖ్య మంత్రి ఆర్.టీ.సీ ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యాలని ఆర్.టీ.సీ యం.డి, గా ట్రాఫిక్ ఈ.ఏం.డి
విజ్ఞప్తి చేయడం జరిగింది.