సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను తీర్చాలి

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను తీర్చాలి

 

రెగ్యులర్ చేసే వరకు సమ్మె కొనసాగించండి మీకు అండగా మేము ఉంటాం పి డి ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ.

 

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,

 

 

మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని గత 17 రోజులుగా నారాయణపేట మున్సిపల్ పార్క్ ధర్నా సెంటర్ దగ్గర సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేపట్టారు వీరి సమ్మెకు మద్దతుగా రాష్ట్ర పి డి ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు హాజరై సమ్మెకు మద్దతు పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరికో విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు నేడు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడం కడు శోచనీయం, రాష్ట్ర వ్యాప్తంగా గత 19 రోజుల నుండి కె జి బి వి లలో విద్య కొనసాగడం లేదు ఆ విద్యార్థులు మాకు చదువు కొనసాగడం లేదని రోడ్డెక్కిన సంగతి విదితమే అయిన ప్రభుత్వానికి ఇవి ఏమి కనిపించడం లేదా కె జి బి వి లలో తాత్కాలికంగా ఉపాధ్యాయులను నియమిస్తున్నారు కానీ అక్కడ పనిచేసే ఉద్యోగుల సమస్యలు పట్టవా అని అన్నారు ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా అధ్యక్షులు సాయి కుమార్,ఉపాధ్యక్షులు గౌస్, కార్యదర్శి రామకృష్ణ, పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్ ల జాక్ రాష్ట్ర కన్వీనర్ మురళీధర్ సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment