---Advertisement---

సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

---Advertisement---

సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

 

మద్దతు ప్రకటించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 11):

 

నాగర్ కర్నూల్ జిల్లాలోని విద్యాశాఖలో పనిచేస్తున్న     సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు కదం తొక్కారు. తమకు న్యాయం చేయాలని, తమ ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రెండవ రోజు ఆందోళన చేపట్టారు.సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. అందులో భాగంగా బుధవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని పాత కలెక్టరేట్ దగ్గర రెండవ రోజు దీక్షను కొనసాగించారు. తక్షణం రెగ్యులర్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ప్లకార్డులు చేతబట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. కేజీబీవీ సీఆర్టీలు, సీఆర్పీలు, డీఎల్ఎంటీ, సీసీఓ, పీటీఐ, మెసెంజర్, యూఆర్ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనకు తరలివచ్చారు. సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన ఈ ఆందోళనకు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని సమగ్ర శిక్ష జెఎసి జిల్లా అధ్యక్షుడు మురళి హెచ్చరించారు. వివిధ సంఘాల ఉపాధ్యాయ నాయకులు జై శ్రీనివాస్ రెడ్డి, రామచంద్రరావు, రాజిరెడ్డి, విజయ్ కుమార్, సురేందర్ రెడ్డి, చిరంజీవులు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment