సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని.
ఉపాధ్యాయ సంఘాల మద్దతు మాకుంది.
నాగర్ కర్నూల్ జిల్లా జేఏసీ అధ్యక్షులు మురళి.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 26):
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైస్ చేయాలని అన్ని ఉపాధ్యాయ సంఘాల మద్దతుగా తమకు ఉందని, ఒకే ఉపాధ్యాయ సంఘం ప్రోద్బలంతోనే సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని నాగర్ కర్నూల్ జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు మురళి తీన్మార్ మల్లన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.గురువారం దాదాపుగా 18 రోజులుగా తాము చేస్తున్న సమ్మెకు పూర్తిస్థాయిలో మద్దతు ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘమే కాకుండా అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు తమకు పూర్తిస్థాయి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.తమకు అన్యాయం చేయకుండా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ కార్యాలయం వద్ద చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు గురువారం వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు కూడా సంఘీభావం తెలిపి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ జేఏసీ అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ విద్యాశాఖలో భాగంగా పని చేస్తూ, గత 18 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు చట్టబద్ధంగా నియమించబడ్డారన్నారు. ప్రభుత్వం తమను రెగ్యులరైస్ చేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే పే స్కేల్ అమలు చేయాలని లేదా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి అన్ని వసతులనైనా కల్పించాలన్నారు.
మా న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
2023లో ఇదే సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెను విరమింపజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు వీరి సమస్యలనుపరిష్కరించాలన్నారు.లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
గురువారం ఉదయం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని ఆయన ఈ సందర్భంగా ఖండించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.