ఈనెల 26న కామ్రేడ్ కేవల్ కిషన్.. పీ లక్ష్మయ్య వర్ధంతి!
ఇద్దరూ అమరులే!!
కేవల కిషన్ నేస్తం…లక్ష్మయ్యను మరచిపోరాదు !
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 23:
కామ్రేడ్ కేవల కిషన్ , కామ్రేడ్ లక్ష్మయ్య వర్ధంతి గా నిర్వహించాలి? కిషన్ కోసం.. ప్రాణం విడిచిన మిత్రుని సంస్కరణ సభలో చోటివ్వాలి?అనేక దశాబ్దాలుగా.. ఇద్దరు మిత్రుల వర్ధంతి సభ గాని నిర్వహించారు?ముదిరాజ్ మహాసభ.. నాయకులు మర్చిపోతున్నారు?
ఇది న్యాయం కాదు?
దళితులు.. పీడితుల కోసం..
అహర్నిశలు. చివరి క్షణాల వరకు కేవల్ కిషన్ పోరాడిన యోధుడు!
దేవుడు పటం ప్రక్కన కేవల్ కిషన్ ఫోటో పెట్టి పూజించే నివాళులర్పించే.. పెద్ద మనసు. విశాలమైన హృదయం, తమకు సాయం చేసిన వ్యక్తులను దైవంతో పోల్చడం.. మెదక్ జిల్లా ప్రజలకు దక్కింది!కేవల కిషన్ చనిపోయిన రోజు!మెదక్ పట్టణం, పల్లెలన్నీ, ! విషాదంలో పొయ్యి వెలిగించలేదు! ఎవరు అన్నపానీయాలు తీసుకోలేదు! అంతా ఉపవాసంతో… కన్నీటి సముద్రం అయ్యారు!పుట్టిన బిడ్డలకు.కిషన్ కిషన్ అమ్మ పేరు పెట్టారు! కిషన్ చనిపోయిన పనుండి దశాబ్దాలపాటు.. మగ పిల్లలకి కిషన్, ఆడపిల్లకు కిషన్ అమ్మ నామకరణ చేయడం! కేవల్ కిషన్ పై మెదక్ జిల్లా ప్రాంతం ప్రజలకు దేవుడు కావడమే.ఎన్నికల్లో ఓడిపోయినా?మెదక్ శాసనసభ ఎన్నికల్లో రెండుసార్లు ఓడిపోయిన… చనిపోయే వరకు ప్రజల కోసమే రాత్రి పగలు పనిచేశాడు! ప్రజల కోసం ప్రాణం విడిచాడు!
కేవల్ కిషన్ కోసం… మిత్రుడు లక్ష్మయ్య మృతి!
కేవల కిషన్ కు, కుడి భుజం లాగా, ఆయన వెంట..అనుక్షణం మోటార్ సైకిల్ నడిపించి.ఆరోజు మరణంలో.. అమరుడైన పి.లక్ష్మయ్య, మరచిపోరాదు! అనేక దశాబ్దాలు కిషన్తోపాటు, కామ్రేడ్ లక్ష్మయ్య వర్ధంతులు నిర్వహించేవారు! ఎందుకో ఏమో గాని కొన్ని సంవత్సరాల నుండి లక్ష్మయ్యను మర్చిపోయారు? ఇది న్యాయం కాదు? జర్నలిస్టు బాలేశ్వర్.