పకడ్బందీగా ఇందిరమ్మ ఇంటింటి సర్వే నిర్వహణ
తెలంగాణ కెరటం దుబ్బాక ప్రతినిధి
దుబ్బాక పురపాలకలోని 20 వార్డుల్లో పకడ్బందీగా, అత్యంత పారదర్శకంగా ఇందిరమ్మ ఇంటింటి సర్వే కొనసాగుతుందని దుబ్బాక పురపాలిక కమిషనర్ కళ్యాణం రమేష్ కుమార్ తెలిపారు. గురువారం పురపాలకలోని 6, 7, 8, 9, 10, 11 వార్డుల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇంటింటి సర్వేను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలికలో నేటి వరకు దాదాపు 90% ఇందిరమ్మ ఇంటింటి సర్వే పూర్తయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వార్డులో ఇప్పటికే పూర్తయిన ఇందిరమ్మ ఇంటింటి సర్వేకు సంబంధించి ఐదు శాతం సర్వే వివరాలను మరోసారి పునః పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. మరో మూడు రోజుల్లో పురపాలికలో ఇందిరమ్మ ఇంటింటి సర్వే 100% పూర్తికానున్నట్లు తెలిపారు. సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండ అత్యంత జాగ్రత్తగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఇన్చార్జి పారిశుద్ధ్య అధికారి దిలీప్, వార్డు ఆఫీసర్ మల్లికార్జున్, పుర సిబ్బంది తదితరులు ఉన్నారు.