ఉత్సాహభరిత వాతావరణం లో రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహణ.

ఉత్సాహభరిత వాతావరణం లో రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహణ.

జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలు మూడవ రోజు ఉత్సాహ భరిత వాతావరణంలో కొనసాగాయి.

జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్

సోమవారం రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలకు సంబంధించి జిల్లా క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు మాట్లాడుతూ పురుషులకు అవుట్డోర్ స్టేడియంలో మహిళలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు.మహిళల విభాగం ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
జగిత్యాలపై నిజామాబాద్ గెలుపు
వరంగల్ పై మెదక్ గెలుపు
హైదరాబాద్ పై సిద్దిపేట్ గెలుపు మహబూబ్నగర్ పై హనుమకొండ గెలుపు.
పురుషుల విభాగం ఫలితాలు:
హనుమకొండ పై మహబూబ్నగర్ గెలుపు.
రంగారెడ్డి పై నిజామాబాద్ గెలుపు.
వరంగల్ పై మెదక్ గెలుపు.
అదిలాబాద్ పై హైదరాబాద్ గెలుపు.
సోమవారం మ్యాచులు ముగిసేసరికి పురుషుల విభాగంలో నిజామాబాద్, మెదక్, సిద్దిపేట మరియు హనుమకొండ జిల్లా జట్లు సెమి ఫైనల్ చేరాయి.
మహిళల విభాగంలో నిజామాబాద్,మహబూబ్నగర్, మెదక్ మరియు హైదరాబాద్ జిల్లా జట్లు సెమీఫైనల్ చేరాయి.
ఈ కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్యాంసుందర్ శర్మ, ఎస్ఏటీజీ పరిశీలకుడు భరత్ కుమార్, పీడీలు శ్రీనివాసరావు, మాధవరెడ్డి, శ్యామ్, రవి, దేవేందర్ రెడ్డి, రాజేందర్, చంద్రమోహన్, అశోక్ గోవర్ధన్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment