శాలువాలతో సన్మానించిన తుంబురు దయాకర్ రెడ్డి
ఖమ్మం, డిసెంబర్ 06 (తెలంగాణ కెరటం): ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో విజేతలుగా నిలచిన వారి ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ తుంబు రు దయాకర్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలకు అండ గా నిలవాలని సూచించారు. పాలేరు అసెంబ్లీ అధ్యక్షుడిగా బాణోత్ కిరణ్ కుమార్, ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా బానోత్ కోటేష్ నాయక్, జిల్లా జనరల్ సెక్రటరీగా క్రాంతి కుమార్ కస్తాల, ఖమ్మం రూరల్ మండల జనరల్ సెక్రెటరీగా కుర్రి హస్సెన్ లను శాలువాతో సన్మానిం చి అభినందించారు. వారితో పాటు ఖమ్మం జిల్లా ముఖ్య నాయకులు భూక్యా సురేష్ నాయక్, మండల నాయకులు మామిడి వెంకన్న, కళ్లెం శేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.