కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల బాగుకోరే ప్రభుత్వం.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మండలానికి ఒక అంబులెన్స్ ఇవ్వడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్. మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 12:
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వమని ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాల ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఉద్దేశంతోనే మండలానికి ఒక అంబులెన్స్ ను ఇవ్వడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్.మైనంపల్లి రోహిత్ అన్నారు.చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా పంపిణీ చేసిన 108 అంబులెన్స్ ను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. స్థానిక వైద్యురాలు డాక్టర్ సాయి సింధు తన సిబ్బందితో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతనంగా ప్రారంభించిన అంబులెన్స్ ను ఎమ్మెల్యే డాక్టర్. మైనంపల్లి రోహిత్ రావు జెండా ఊపి ప్రారంభించారు,అనంతరం ఆసుపత్రిలో ఉన్న సమస్యలను వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు,ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతనం అందించే విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి తమ సమస్యలను తీర్చాలంటూ ఆశ వర్కర్లు మెదక్ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు, సంగయ్యపల్లి గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకపోవడంతో స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్. మైనంపల్లి రోహిత్ రావు గ్రామంలో నీటి సమస్య వెంటనే పరిష్కరించాలని సూచించారు,అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని ఉద్దేశంతో మండలానికి ఒక అంబులెన్స్ అందించడం జరిగిందని ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే ద్యేయంగా ముందుకు సాగడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మన్నన్,మండల వైద్యాధికారి సాయి సింధు,మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్,108 ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ జనార్ధన్,108 ప్రోగ్రాం ఆఫీసర్ అఫ్రొజ్, స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, గోపాల్ రెడ్డి,చిరంజీవి,పుల్లారావు,కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్,తిగుళ్ల బిక్షపతి,రాజశేఖర రెడ్డి,రాజేష్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, కార్యదర్శి రామచంద్రo,సురేందర్ నాయక్, మోహన్ నాయక్, అశోక్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.