---Advertisement---

కానిస్టేబుల్ మృతి రాయపోలో విషాదం

---Advertisement---

కానిస్టేబుల్ మృతి రాయపోలో విషాదం

అందరితో కలుగొలుగా ఉండే పరంధాములు.

రన్నింగ్ ప్రోత్సహించే పరంధాములు.

తెలంగాణ కెరటం :రాయపోల్ ప్రతినిధి: డిసెంబర్ 8
అందరితో కలగోల్పుగా ఉంటూ రాయపోల్ పోలీస్ స్టేషన్లో మంచి పేరు తెచ్చుకున్న పరంధాములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం రాయపోల్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది. పోలీస్ స్టేషన్కు వచ్చి ప్రతి ఒక్కరిని ఆప్యాయతో పలకరించి మంచి చెడులను తెలుసుకొని వారితో ఆప్యాయంగా ఉండి అనతి కాలంలోనే ప్రజల మనలను పొందిన పరంధాములు మృతి చెందడం రాయపోల్ మండల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మండల కేంద్ర ప్రజల మధ్యన గడిపిన పరంధాములు తెల్లారేసరికి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత గురి కావడం అటు పోలీసులను. ఇటు నాయకులను. అటు ఆయన అభిమానులకు విషాద సంఘటన నింపింది. జూలైలో బాధ్యతలు స్వీకరించిన పరంధాములు అందరితో మంచిగా ఉంటూ యువకులను ప్రోత్సహిస్తూ విధులను సక్రమంగా నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పట్ల రాయపోల్ మండల కేంద్ర ప్రజలు నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ పరంధామం ఎప్పుడు యువకులను చైతన్యం చేసే అలవాటు ఉండేదని. కానిస్టేబుల్ ఉద్యోగాలకు యువకులను ప్రోత్సహించే తత్వం ఆయనకు ఉండేదని పలువురు తెలిపారు. చిన్న వయసులోని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధాకరమని ఆయన మృతి తీరని లోటు అని కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం గ్రామస్తులు వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment