నాగులమ్మ,వీరహనుమన్ల గుడి వద్దకు కరెంట్ స్తంభాల నిర్మానం

నాగులమ్మ,వీరహనుమన్ల గుడి వద్దకు కరెంట్ స్తంభాల నిర్మానం

 

కాంగ్రేస్ పార్టీ మండల ఉపాద్యక్షులు ర్యాకం యాదగిరి

 

తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి 18,

 

గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే,సిద్దిపేట జిల్లా కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ తూంకుంట నర్సారెడ్డి చోరువతో,సిద్దిపేట జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షులు బబ్బూరి మల్లేశం గౌడ్,మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు తాండ కనకయ్య గౌడ్ ల సహకారంతో,మండల ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి ఆద్వర్యంలో మర్కుక్ మండలంలోని చేబర్తి గ్రామంలో గల పెద్దమ్మ తల్లి గుడి వద్ద నుండి వీరహనుమన్లు,నాగులమ్మ గుడి వరకు శనివారం నాడు కరెంట్ స్తంభాల నిర్మాణ పనులు జరిగాయి.ఈ సందర్భంగా ర్యాకం యాదగిరి మాట్లాడుతూ చేబర్తి గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం నుండి కొలువుదీరిన వీర హనుమన్లు,నాగులమ్మ విగ్రహాలు కొండపోచమ్మ ప్రాజెక్ట్ పనులలో బాగంగా త్రవ్వకాలలో బయట పడ్డాయని,అది చూసిన గ్రామస్తులు అక్కడనే నాగులమ్మ,వీరహనుమన్ల గుడిని నిర్మించారని అన్నారు.సాయంత్రం సమయంలో గుడి వద్దకు వెళ్లడానికి సరైన లైట్స్ లేకపోవడంతో గ్రామస్తులకు ఇబ్బందిగా మారిందని అన్నారు.ఈ విషయం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డికి తెలిపగానే వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు.వెంటనే 10 స్తంభాలు నిర్మాణం చేయాలని వారితో సూచించారు.విద్యుత్ అధికారులతో మాట్లాడి స్తంభాలు వేయించినందుకు నర్సారెడ్డికి గ్రామస్తుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.వారితో పాటు గ్రామస్తులు కొండ రమేష్,షమ్మని వెంకటేష్,ర్యాకం కనకయ్య తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment