వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఈరపాక నర్సింహ

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఈరపాక నర్సింహ

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (జనవరి 15):

 

పట్టణం లోని బహర్ పేట లో సంధ్య హాస్పిటల్-బయో మెల్ ప్రెవేట్ లిమిటెడ్-రాయల్ డైయాగ్నోస్టిక్స్ వారి సంయుక్త ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఉచిత దంత మరియు సాధారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడినారు. డా॥సాయి కిరణ్ ఎం బి బి ఎస్ మరియు డా.సుధీర్ రెడ్డి బి డి ఎస్ సమాజానికి తమవంతు సహాయం చేయడం హర్షణీయమన్నారు.సూర్య యూత్ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమము లో సుమారు 100 మంది రోగులను పరీక్షించి ఉచిత మందులను పంపిణితో పాటు రక్త పరీక్షలు చేయడం జరిగినది.ఈ కార్యక్రమములో సంధ్య హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ కర్తాల శ్రీనివాస్,బయోమెల్ ఎం డి సిద్దులు,రాయల్ డైయాగ్నోస్టిక్స్ షఫీ,రాకేష్,సంధ్య హాస్పిటల్ సిబ్బంది,బస్తి పెద్దలు,సూర్యయూత్ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment