షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు కాలిపోయిన కుటుంబానికి పరామర్శ*

*షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు కాలిపోయిన కుటుంబానికి పరామర్శ*

తెలంగాణ కెరటం భీంగల్ ప్రతినిధి డిసెంబర్ 19:

భీంగల్ మండలం ఎంజి తాండ పరిధిలోని భూక్యతండకు చెందిన మోతీలాల్ ఇల్లు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కు గురై పూర్తిగా కాలిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించి ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment