బిఆర్ఎస్ జిల్లా కార్యాలయం పై కాంగ్రెస్ దాడిని ఖండిస్తున్నాం: ఎండి జహంగీర్, సిపిఎం జిల్లా కార్యదర్శి
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (జనవరి 11):
భువనగిరి జిల్లా బిఆర్ఎస్ కార్యాలయం పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఖండిస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు.రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ సహజం.ఏ విమర్శ అయినా తప్పును ఎత్తి చూపేలా ఉండాలి కానీ గాయపరిచేలా ఉండకూడదు.రాజ్యాంగ హక్కులను అందరు గౌరవించాలి. భౌతిక దాడులకు పూనుకోవడం సమంజసం కాదని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సహనం, సమన్వయం కోల్పోతే ప్రజలకు దూరం అవుతుందని అన్నారు. పోలీసులు నిస్పక్ష పాతంగా వ్యవహరించాలని జహంగీర్ కోరారు. వీరితోపాటు సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు ఉన్నారు.