క్రికెట్ సీజన్ టు ఫైనల్ బి వి పి యల్
తెలంగాణ కెరటం కౌడిపల్లి ప్రతినిధి జనవరి 15
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని బుజరంపేట్ మరియు వెంకటాపూర్ బి గ్రామంలో క్రికెట్ బివి పిఎల్ సీజన్ 2 టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా నాలుగు జట్లు ఆడడం జరిగింది. ఈ సీజన్లో ఫైనల్ ఆడిన టీముకు ఫస్ట్ ప్రైజ్ 10000 రూపాయలు సెకండ్ ప్రైజ్ 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఫైనల్లో గెలిచిన టీంకు నర్సాపూర్ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా ప్రైస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రైస్ గోపాల్ టీంకు 10000 ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్రైజ్ వెంకటేశం టీంకు 5000 ఇవ్వడం జరిగింది. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి నాయికోటి శ్యాంసుందర్రావు ప్రతి టీంకు జెర్సీలు మరియు టోర్నమెంట్లో ఇచ్చిన ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ టోర్నమెంట్ ని విజయవంతం చేశారు.