సీసీ కెమెరాలతో నేరా నియంత్రణ.
తొగుట సిఐ షేక్ లతీఫ్.
తెలంగాణ కెరటం :రాయపోల్ ప్రతినిధి :డిసెంబర్ 14
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చునని తొగుట సిఐ షేక్ లతీఫ్ అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ ఆలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో 4 సీసీ కెమెరాలు రాయపోల్ మండలంలోని అనాజిపూర్ గ్రామంలోని పెద్దమ్మ ఆలయం నందు దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన నాలుగు సీసీ కెమెరాలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
ప్రతి గ్రామం లో అన్ని దేవాలయాలలో మరియు ముక్యమైన చౌరస్తాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోని మా పోలీస్ సిబ్బందికి సహకరించగలరని తెలిపారు. ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరమని. ఏదైనా దొంగతనం జరిగినప్పుడు సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకునే అవకాశం తొందరగా దొరుకుతుందన్నారు. ప్రతి గ్రామంలో. ప్రతి ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ కృషి చేస్తుందని. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటే సహించే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. సైబర్ నేరాలు. గంజాయి డ్రగ్స్ వాటి నియంత్రణపై ఉక్కు పాదం మోపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వాహనదారులు ఉన్న ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించాలని. వాహనాలకు సంబంధించిన పత్రాలు దగ్గర ఉండాలని. రోడ్డు నిబంధనలు అతికమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట ఏ ఎస్ ఐ దేవయ్య. పెద్దమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు నీల స్వామి. జోడు కర్ణాకర్. ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.