*హైవే పై అడ్డగోలు పార్కింగ్..!*

*హైవే పై అడ్డగోలు పార్కింగ్..!*

*జెపి దర్గా కమాన్ వద్ద టిఫిన్ సెంటర్ల ఎదురుగా అక్రమ పార్కింగ్ కు అడ్డు, అదుపు లేకుండా పోయింది*

*ఇష్ట అనుసారంగా వాహనాలు నిల్పడంతో రాకపోకల కు ఇబ్బందులు*

తెలంగాణ కెరటం కత్తూరు ప్రతినిధి డిసెంబర్ 24.

*కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్డు నుండి జేపీ దర్గా కమాన్ వద్ద ప్రతిరోజు ఉదయం టిఫిన్ సెంటర్ ముందు యదేచ్చగా అక్రమ పార్కింగ్, చేయడంతో అటువైపు నుండి వచ్చే వాహనాలకు ఎంతో ఇబ్బందులు కలుగుతున్నాయని వాహనదారులు, పాదాచారులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నమని ఆరోపిస్తున్నారు. కానీ కొత్తూరు ట్రాఫిక్ పోలీస్ అధికారులకు ఇవేమీ కనిపించడం లేదు. టిఫిన్ సెంటర్ల ఎదురుగా అక్రమంగా రోడ్డు మీదనే పార్కింగ్లు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టిఫిన్ సెంటర్ ముందు అక్రమ పార్కింగ్ చేసిన వాహనాలకు ఎప్పుడో ఒకసారి తూ తూ మాత్రంగా చాలన్లు వేస్తున్నారు. తప్పితే ట్రాఫిక్ సమస్యను మాత్రం తీర్చడం లేదని ట్రాఫిక్ పోలీసులపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. నిత్యం అక్కడ వీధుల నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు చూసి చూడనట్లు వదిలేయడంతో నిత్యం ఉదయం, ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న టిఫిన్ సెంటర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు కురిపిస్తున్నారు. టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చే వాహనదారులు రోడ్డుపైనే అడ్డగోలుగా పార్కింగ్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు టిఫిన్ సెంటర్ యజమాని పట్టించుకోకపోవడం వల్ల అక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్పందించి పార్కింగ్ లేని వారిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.*

Join WhatsApp

Join Now

Leave a Comment