---Advertisement---

జువ్వాడి కృష్ణారావుకు మల్లన్న జాతర ఆహ్వాన పత్రికను అందజేసిన డబ్బా గ్రామస్తులు

---Advertisement---

జువ్వాడి కృష్ణారావుకు మల్లన్న జాతర ఆహ్వాన పత్రికను అందజేసిన డబ్బా గ్రామస్తులు

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 13 : కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో ఆదివారం నుండి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్న శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న) జాతర మహోత్సవానికి రావలసిందిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావుకు డబ్బా గ్రామ ప్రజలు ఆహ్వాన పత్రిక అందజేశారు. మాజీ ఉప సర్పంచ్ బూస రాజేశ్వర్ ఇతర గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఈరోజు కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్ లో శుక్రవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. గతంలో ఆలయ అభివృద్ధికి సిసి రోడ్డుకు నిధులు మంజూరు చేయించారని అందుకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అలాగే ఆలయం చుట్టూ ప్రహరీ గోడ తదితర అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయించాలని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు జువ్వాడి కృష్ణారావును కోరారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా డబ్బా మల్లికార్జున స్వామి ఆలయానికి తప్పకుండా నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూసరాజేశ్వర్, దేశెట్టి జీవన్, జానా శంకర్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment