నేడు జరగబోయే నిరసన కార్యక్రమానికి దళిత బహుజనులు తరలిరావాలి
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 19 :
రాజ్యాంగంపై ఓ పక్క చర్చ జరుపుతూనే తాము గౌరవిస్తున్నమంటునే అదే రాజ్యాంగ నిర్మాతఐన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పై రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం జరగబోయే ధర్నా కార్యక్రమానికి మండల దళిత సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు, అంబేడ్కర్ యువజన సంఘాల ప్రజలందరు భారీఎత్తున నల్ల జెండాలతో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.