---Advertisement---

దళితుల భూములు గుంజుకోని మట్టి కొట్టొద్దు

---Advertisement---

-భారత్ బయోటెక్ ప్రతినిధుల మంటూ బెదిరింపులు

-భారత్ బయోటెక్ కంపెనీకి దళిత రైతుల విన్నపం

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి నవంబర్ 28,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కరకపట్ల గ్రామానికి చెందిన
పాలె నరసయ్య 1965 నుండి 285 సర్వేనెంబర్ లో మూడు ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నమని,భారత్ బయోటెక్ కంపెనీ ప్రతినిధుల పేరుతో కొందరు మధ్యవర్తులు తమను భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.దళిత కుటుంబానికి చెందిన తమకు ఆ భూమి తప్ప మరే భూమి లేదని,రెవెన్యూ అధికారులు గ్రామానికి చెందిన బ్రోకర్లు కలిసి 2017 నుండి ఇప్పటివరకు ఏడు ఎనిమిది సార్లు సర్వే నుండి ఇచ్చారన్నారు.పైన కంపెనీ యాజమాన్యానికి తెలవకుండా ఇక్కడ ఉండే బ్రోకర్లు తమ భూమిని అమ్ముతామంటూ డబ్బులు నొక్కేసారని,ఇప్పుడు ఒత్తిడికి గురిచేస్తూ ఇబ్బందుల చేస్తున్నారని వాపోయారు.ఈ భూమిని నమ్ముకొని బ్రతుకుతున్న తమ కుటుంబాన్ని రోడ్డుకిడ్చొద్దని అన్నారు.జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment