---Advertisement---

కేజీబీవీ విద్యార్థినిలకు గణిత సబ్జెక్ట్ బోధించిన డీఈఓ రమేష్ కుమార్.

---Advertisement---

కేజీబీవీ విద్యార్థినిలకు గణిత సబ్జెక్ట్ బోధించిన డీఈఓ రమేష్ కుమార్.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 16):

 

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తాలూకా

పెద్దకొత్తపల్లి మండలం కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగావిద్యాలయంలో వంటగది, నిలువఉన్న సరుకులను, పలు రికార్డు లను పరిశీలించారు.అనంతరం డీఈఓ పదో తరగతి తరగతి గదిలో విద్యార్థులకు గణిత పాఠాలు బోధించారు. విద్యాబోధన జరుగుతున్న తీరునుఅడిగితెలుసుకున్నారుఈ సందర్భంగా డిఇఓ రమేష్ కుమార్ మాట్లాడుతు.కేజీబీవీలకు సరుకులు కూరగాయలు సప్లై చేసే కాంట్రాక్టర్ నుంచి కుళ్లిన కూరగాయలను తీసుకోవద్దన్నారు. నాణ్యత లేనితినుబండారాలతో వంటలు చేసి విద్యార్థులకు పెట్టకూడదని డిఇఓ సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, విద్యార్థులు అనారోగ్యానికి గురైతేవారికి మెరుగైనవైద్యం అందించాలని అన్నారు.అదేవిధంగా వ్యాధులకు గురైన విద్యార్థుల వివరాలను రిజిష్టరులో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం నుండి వచ్చిన ఉలన్ దుప్పట్లను డిఇఓ విద్యార్థినిలకు పంపిణీ చేశారు. విద్యార్థినిలు మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలోకి రాణించాలని సూచించారు. డీఈఓ వెంట కేజీబీవీల పర్యవేక్షణ అధికారిని శోభారాణి పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment