నూతన సంవత్సర సందర్భముగా లక్ష్మి నరసంహస్వామి ని దర్శించుకున్న భక్తులు .
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 01 . 2025 జనవరి 1. ఆంగ్లనూతన సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం భక్తుల జనసందోహంతో ప్రాంగణమంతా కిటకిటలాడింది.సుమారు 3000వేలమంది భక్తులు ప్రత్యేకపూజలు చేయించుకొన్నారు. శ్రీజనార్ధనరెడ్డిగారు వచ్చిన భక్తులకు తీర్థప్రసాదములతో పాటు సుమారు 1500 మందికి భోజనసదుపాయము కలుగచేసినారు .ఆలయ అభివృద్ధి కమిటీ వారు భక్తులకు అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినారు.