*డి ఎస్ పి ఆమరణ నిరాహార దీక్ష మద్దతుగా: ధరావత్ రాజు నాయక్*
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి,డిసెంబర్ 19:
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో వినాయక చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డి ఎస్ పి జిల్లా అధ్యక్షుడు నల్ల నరేందర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. నిరుపేద మధ్యతరగతి ఎస్ సి,ఎస్ టీ,బి సి ప్రజలకు విద్య, వైద్యం, ఇల్లు, ఉపాధి, భూమి సాధనకై దీక్ష చేపట్టారు. వారి డిమాండ్లకు మద్దతుగా లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రాజు నాయక్ పాల్గొని సంఘీభావం తెలుపుతూ ధర్మ సమాజ్ పార్టీ అడుగుతున్న డిమాండ్లు న్యాయబద్ధమైన డిమాండ్లు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్న నరేందర్ గారి ఆరోగ్య పరిస్థితి రోజురోజుగా క్షీనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేనియెడల వారికి ఏమైనా జరుగుతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం.ఈ కార్యక్రమానికి యల్ ఎహ్ ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి ధీరావత్ రాజేష్ నాయక్ , జిల్లా ఇంచార్జ్ బానోత్ భాస్కర్ నాయక్, పట్టణ అధ్యక్షులు బానోత్ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.