---Advertisement---

ధర్మాజిపేట జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం వేడుకలు  దుబ్బాక:డిసెంబర్23,(తెలంగాణ కెరటం )

---Advertisement---

ధర్మాజిపేట జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం వేడుకలు 

దుబ్బాక:డిసెంబర్23,(తెలంగాణ కెరటం )

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజిపేట లోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరు నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులందరూ గణితం యొక్క నమూనాలను ప్రదర్శించడం జరిగింది. దుబ్బాక మండలం ఎంఈఓ ప్రభుదాస్ మ్యాథమెటిక్స్ మేలాని సందర్శించి విద్యార్థిని విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ రెడ్డి మరియు పద్మావతి గణిత శాస్త్రం ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా క్విజ్ పోటీలు మరియు ఫార్ములా పోటీలలో అలాగే గణితoకు సంబంధించిన నమూనాల తోపాటు ఉపన్యాసాలు మరియు డ్రామ ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయుడి సాదత్ అలీ మాట్లాడుతూ, జీవితంలో గణితం యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనదని గణితం అన్ని సబ్జెక్టులకు మూలమని గణితాన్ని సులభంగా నేర్చుకునే పద్ధతుల ద్వారా జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణిస్తారని తెలపడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులు అందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస చారి, పద్మావతి అశోక్, దినేష్ ,మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment