కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద డబుల్ బెడ్ రూమ్ వాసుల ధర్నా.
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి
ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ లకు పట్టాలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ల వద్ద వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద రామేశ్వర పల్లి ,దేవునిపల్లి, రాజీవ్ నగర్, ఇల్చిపూర్ , నర్సన్నపల్లి డబుల్ బెడ్ రూమ్ లో నుండి భారీ ఎత్తున డబల్ బెడ్ రూమ్ వాసులు ధర్నా చేపట్టారు.
ప్రభుత్వాలు మారుతున్న తమకు ఇప్పటివరకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం లేదని, వెంటనే అధికారులు స్పందించి తమకు ఇండ్ల పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న వాసుల వద్దకు
ఆర్డీఓ రంగనాథ్ రావు చెరుకుని 10 రోజుల్లో పట్టాలు అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన డబుల్ బెడ్ రూమ్ వాసులు. ఈ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ అధ్యక్షులు దుర్గొల్ల రాజు, మాజీద్ మాట్లాడారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద డబల్ బెడ్ రూమ్ వాసులకు పట్టాలి ఇవ్వాలని ధర్నా చేయడం జరిగిందని, ఆర్డిఓ రంగనాథరావు స్పందించి పది రోజులలో డబల్ బెడ్ వాసులకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించడం జరిగిందని తెలిపారు. చెప్పిన తేదిలోపు పట్టాలి ఇవ్వకపోతే తర్వాత ఇక్కడే వంట వార్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డబల్ బెడ్ రూమ్ వాసులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.