అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 21 : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని శనివారం కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. అనంతరం దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్రమంత్రి అమీత్ షా అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఇలాంటి మాటలు మళ్ళీ పునరావృత్తం కావద్దని తాను మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కోడిపల్లి సురేష్, పసుల కృష్ణ ప్రసాద్, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, దామ కొండయ్య, ఉయ్యాల నర్సయ్య, మగ్గిడి వెంకటీ, పోట్ట లక్ష్మణ్, పోట్ట దేవదాస్, పొట్ట ప్రేమ్ కుమార్, మోర్తాడ్ రాజశేఖర్, శనిగారపు రాజేష్, మ్యకల మహేష్, ఎడ్ల ప్రభాకర్, దామ రాకేష్, కొండా బృగదీశ్వర్, మైస నవీన్ తదితరులు పాల్గొన్నారు.