డిజిటల్ అరెస్టు అనేది ఉండనే ఉండదు

డిజిటల్ అరెస్టు అనేది ఉండనే ఉండదు

 

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 

మర్కుక్ మండల ఎస్ఐ ఓ.దామోదర్

 

తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి 08,

 

పాములపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు బుధవారం నాడు సైబర్ జాగృత్ దివాస్ లో భాగంగా మర్కుక్ మండల ఎస్ఐ ఓ.దామోదర్ సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.అందులో భాగంగా డిజిటల్ అరెస్ట్ విషయంపై మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ అనే విధానం అనేదే లేదు అని,ఎవరైనా ఫోన్ ద్వారా గానీ,వీడియో కాల్ ద్వారా గానీ తాము పోలీస్,సిబిఐ లేదా ఇతర అధికారులము లేదా న్యాయమూర్తులము అని పరిచయం చేసుకుని,మీపై కేస్ నమోదు అయింది ఆ కేస్ లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని,అటువంటి కాల్స్ ఎవరికైనా వస్తే ప్రజలు ఎవరు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని,ఎవరికీ ఆన్లైన్లో కానీ,మరే ఇతర మార్గాల ద్వారాగానీ డబ్బులు పంపించి మోసపోవద్దని,వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు,ఇరుగుపొరుగు వారికి డిజిటల్ అరెస్ట్ పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.అంతే కాకుండా లోన్ ఆప్స్,సోషల్ మీడియా,ఆన్లైన్ షాపింగ్ తదితర ఇంటర్నెట్ తో సంబంధం కలిగిన విషయాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సయ్యద్ లతీఫ్,ఉపాధ్యాయులు హెడ్ కానిస్టేబుల్ యాదయ్య,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment