ఆదివాసులకు అండగా.. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 19):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం ఎర్ర పెంట గ్రామంలో చెంచు గిరిజనులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలతో అండగా ఉంటూ ఆదివాసి గిరిజన చెంచులకు గురువారం దుప్పట్ల పంపిణీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ
నాగరిక జీవితానికి దూరంగా నల్లమల అటవీ ప్రాంతంలో జీవిస్తున్న చెంచు గిరిజనులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని పేదల అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్నదని అన్నారు.చెంచు గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసిన పథకాలను సద్వినియోగ పరుచుకొని అన్ని రంగాలలో రాణించాలని సూచించారు.వెనుకబాటుతనానికి చదువుకోక పోవడమే కారణమని కాబట్టి చిన్నారులను చదివించాలని కోరారు.చెంచు గిరిజనులకు చేయూత అందించడానికి అటవీలో నివసించే చెంచు గిరిజనులకు,మైదాన ప్రాంతంలోని పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.బ్రిటిష్ నుండి విముక్తి కలిగిస్తూ భారతదేశానికి స్వాతంత్రం సాధించిన పార్టీగా అధికారంలోకి వచ్చి భారతదేశానికి సుదీర్ఘకాలం పరిపాలన అందించి దేశ పురోగమననికి పాటుపడిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని అన్నారు.పేదలకు అండగా ఉంటూ వారి అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు అందరిని భాగస్వాములు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.పేదలకు అండగా నిలుస్తూ మండలంలో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరావు, పట్టణ అధ్యక్షులు పూజారి వెంకటయ్య, నియోజకవర్గం గిరిజన ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు శంకర్ రాథోడ్,మాజి వైస్ ఎంపిపి నారాయణ గౌడ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివ,మార్కెట్ డైరెక్టర్ ఐ ఎన్ టి యు సి నేతలు సాయి,రవి, తరుణ్, హరి తేజ గౌడ్,గద్ద బాలకృష్ణ,కురువ శ్రీశైలం, బాలరాజు,గుత్తి వెంకటయ్య,నందిని మండల అన్ని గ్రామాల ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.