చందుర్తి లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.
తెలంగాణ కెరటం, చందుర్తి మండలం,నవంబర్ 30.
చందుర్తి మండల కేంద్రంలోని బస్టాండు ఆవరణలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శనివారం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్ పంపిణీ చేశారు.వివిధ వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఈ చెక్కులను పంపిణీ చేశారు, గ్రామంలో 70,000 రూపాయల చెక్కులను కాంగ్రెస్నాయకుల ఆధ్వర్యంలో ఈ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో పులి సత్యం, మార్కెట్ డైరెక్టర్లు మర్రి కృష్ణ, నాగుల శంకర్, పోతరాజు రవి, పొంచేట్టి లింగయ్య, మర్రి లక్ష్మణ తిరుపతి,పులి నరేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.