తిమ్మాపూర్ లో ప్రజా పాలన కరపత్రల పంపిణీ
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 11 :
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన పురస్కరించుకొని, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ పార్టీ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డిఆదేశాల మేరకు తిమ్మాపూర్ గ్రామంలో ప్రతిరోజు 10 రోజులపాటు, కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవ పాలన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, మోర్తాడ్ మండల యువజన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నాయకులు మారోడి సురేష్, అధ్యక్షులు కుంట శ్రీనివాస్, బాల్కొండ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుబద్ధం రాజశేఖర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు శివారెడ్డి శంకర్ లు అన్నారు. బుధవారం రోజున తిమ్మాపూర్ గ్రామంలో మండల,గ్రామ కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోపు చేపట్టిన పలు అభివృద్ధి పథకాల, సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూకరపత్రాలను పంపిణీ చేయడమే కాకుండా, ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న పథకాలపై ఇంటి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తూ వివరించారు. ఒకవేళ ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకుంటే, అట్టివారు స్థానిక గ్రామ కాంగ్రెస్ నాయకులకువిన్నవిస్తే, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించేలా తమ వంతు సహకారాలు అందిస్తూ కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు,గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,మహిళలు, తదితరులు, పాల్గొన్నారు.