ఘనంగా ప్రారంభమైన జిల్లా సీఎం కప్ – 2024.
క్రీడాకారులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్.
జాతీయస్థాయిలో జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చెయ్యాలి.
జిల్లా ఎస్పీ,
నాగర్ కర్నూల్ ఊరుకొండ జట్ల మధ్య టాస్ వేసి ఖో ఖో క్రీడా, పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్.
నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 17):
రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీసి జాతీయ అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడం కోసం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.మంగళవారం నాగర్ కర్నూల్ పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ గ్రౌండ్ నందు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, తో కలిసి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ప్రారంభించారు.అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జెండాను ఎగరవేశారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన, ఎన్సిసి విద్యార్థుల, క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మాట్లాడుతూ జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను తేది 17-12-2024 నుండి 20-12-2024, వరకు నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలలో రాణించే విధంగా శిక్షణ ఇవ్వడమే సీఎం కప్ క్రీడా పోటీల ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలకు 20 మండలాలు ,4 మునిసిపాలిటీల నుండి క్రీడా కారులు పాల్గొనడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని వారికి అవకాశాలు లేక వారి ప్రతిభ ప్రపంచానికి తెలియకుండాపోయిందన్నారుగ్రామీణ ప్రాంత క్రీడాకారులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు రూపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి, క్రమశిక్షణకు, తోడ్పడుతాయన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు చదువులో కూడా ప్రతిభ కనబరుస్తారన్నారు. ప్రతి ఒక్కరూ చదువుతోపాటు వారికి ఇష్టమైన ఏదో ఒక క్రీడలు రాణించాలని కలెక్టర్ సూచించారు., క్రీడాకారులు గెలుపు ఓటములను సమంగా స్వీకరించాలన్నారు. గెలుపుతో పొంగిపోవద్దని ఓటమితో కృంగిపోవద్దని గెలుపు కోసంప్రయత్నించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.జాతీయస్థాయి క్రీడలలో పాల్గొని జిల్లాకు ఎక్కువ పథకాలు తేవడమే ముఖ్యఉద్దేశమని అన్నారు. క్రీడాకారులకు జిల్లా నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. నాగర్ కర్నూల్ ఊరుకొండ జట్ల మధ్య టాస్ వేసి ఖో ఖో పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, మాట్లాడుతూ గ్రామీణ మండల స్థాయిలో విజయం సాధించి జిల్లా స్థాయిలో పాల్గొంటున్న క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో జిల్లా ఖ్యాతిని పెంపొందించాలని అధిక మొత్తంలో జిల్లాకు పథకాలు సాధించి పెట్టాలని తెలియజేశారు. ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం గ్రామీణ యువతలోని ప్రతిభను వెలికితీయడం. ప్రతిభావంతులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా దేశానికి పతకాలు సాధించడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్ పర్సన్ కల్పన భాస్కర్, డి వై ఎస్ ఓ సీతారాం నాయక్, డిఎస్పి శ్రీనివాసులు, వివిధ క్రీడా అసోసియేషన్ నాయకులు, పీఈటీలు, అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.