డిసెంబర్ 1 నుండి 9 వ తేది వరకు జిల్లాలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 30:
శనివారంకలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుండి 9 వరకు జిల్లాలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు. శాఖల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాఖాపరంగా కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల విజయగాధాలను తెలిపే విధంగా ఫ్లెక్సీ లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, జిల్లా అటవీ అధికారిణి నిఖిత, జడ్పీ సీఈవో చందర్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.