రైతు పండుగ ప్రత్యక్ష ప్రసారాన్ని తూడుకుర్తి రైతు వేదికలో రైతులతో కలిసి వీక్షించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 30):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గత మూడు రోజులుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు పండుగ వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా నుండి రైతులను ఉద్దేశించిన ప్రసంగించిన సదరు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా నాగర్ కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామ రైతు వేదికలో గ్రామానికి చెందిన పలువురు రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వీక్షించారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంత్రులు అధికారుల ప్రసంగాన్ని రైతు వేదికలో రైతులతో కలిసి వీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక సదుపాయాలను కల్పించడంతోపాటు రైతు రుణమాఫీ, పంట నష్టపరిహారాలు, సన్న రకం వడ్లకు ప్రతి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ అందజేయడంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో జిల్లాలోని రైతంగానికి ఎంతో లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు.నాగర్ కర్నూలు జిల్లా నలుమూలల నుండి వేలాదిమంది రైతులు అధిక సంఖ్యలో నేరుగా రైతు పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుండి 250 బస్సుల్లో బయలుదేరి వెళ్లి మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించే రైతు పండుగ కార్యక్రమంలో పాల్గొని, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంటల ఉత్పత్తిపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
గత మూడు రోజులుగా జిల్లా నుండి అనేక మంది రైతులు పాల్గొని తమఅభిప్రాయాలను, సందేహాలను శాస్త్రవేత్తలతో నివృత్తి చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.నేటి రైతు పండుగ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని రైతువేదికల్లో ఏర్పాటు చేసి రైతులతో కలిసి ఆయా మండలాల అధికారులు వ్యవసాయ అధికారులు పాల్గొని వీక్షించినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.