---Advertisement---

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.

---Advertisement---

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి.

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 30):

విధుల్లో చేరిన నాటి నుంచి అహర్నిశలు కృషి చేసే ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పనిసరని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు.మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్ రావు పదవీ విరమణ సందర్భంగా శనివారం నాగర్ కర్నూల్ పట్టణంలోని వేలమ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లా మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ అధికారిగా శ్రీధర్ రావు తనకు కేటాయించిన విధుల పట్ల నిబద్దతో పనిచేశా రని, అధికారులు, డిఈలు,ఎఈలు సిబ్బందితో స్నేహభావంగా ఉంటూ క్రమ శిక్షణతో విధులు నిర్వహించేలా పర్యవేక్షించారన్నారు.జిల్లాలో ప్రభుత్వం విధించిన విధి విధానాల ప్రకారం మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో ఇంటింటికి సరఫరా చేసే తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు, పరిష్కరిస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలందించరని కలెక్టర్ తెలిపారు.ఎప్పుడు పిలిచిన వెంటనే స్పందిస్తూ జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా ఇంటికి పంపిణీ చేసే త్రాగునీటి సరఫరాలో తలెత్తి సమస్యలనుపరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారని,ఈఈ శ్రీధర్ రావు సేవలను ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశంసించారు. అదనపు కలెక్టర్ కే సీతారామారావు మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో 34 సంవత్సరాల నుండి అంకితభావంతో వివిధ హోదాలలో పనిచేశారని, ఉద్యోగ విరమణ అనంతరం శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.అదనపు కలెక్టర్ కే సీతారామారావు, జిల్లా అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు, జిల్లా వెటర్నరీ అధికారి డాక్టర్ జీవి రమేష్, జిల్లా పంచాయతీ అధికారి రామ్మోహన్ రావు, మిషన్ భగీరథ ఈఈ సుధాకర్ సింగ్, జిల్లా క్రీడల అధికారి సీతారాం నాయక్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ లు ఈఈ శ్రీధర్ రావును ఘనంగా సన్మానించారు. వివిధ శాఖల అధికారులు, మిషన్ భగీర డిఈలు, ఎఈలు,సిబ్బంది, ఆయన కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment