గ్రూప్-2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన-: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (డిసెంబర్ 10)
మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్ లు, రూట్ ఆఫీసర్స్, ఇన్విజిజిలేటర్ లతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు 30 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వికారాబాద్ రీజినల్ పరిదిలో 19, తాండూర్ రీజినల్ లో l1 పరీక్ష కేంద్రాలలో మొత్తం 10381 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. వికారాబాద్ మండలంలో 14 పరీక్ష కేంద్రాలు, పూడూరు మండలం 1, పరిగి మండలం 4 పరీక్ష కేంద్రాల్లో అదేవిధంగా తాండూర్ మండలంలో 11 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇన్విజిలేటర్ లు, శాఖపరమైన అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష పత్రాలను తీసుకువెళ్లేందుకు బందోబస్తు, ఎస్కార్ట్ల తో తీసుకెళ్లేందుకు ఏర్పాట్లను చే సుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విదించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గ్రూప్ 2, పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.జిల్లా వ్యాప్తంగా (30) పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, (10381) మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, డిసెంబర్ 15వ తారీకు ఉదయం 10. నుండి 12. 30, వరకు, మధ్యాహ్నం 3గంటల నుండి సాయంత్రం 5.30 వరకు,డిసెంబర్ 16వ తారీకు ఉదయం,10 గంటల నుండి 12.30. వరకు, మధ్యాహ్నం 3. గంటల నుండి సాయంత్రం 5. 30 వరకు,నాలుగు దఫాలుగా పరీక్షలు జరుగుతాయన్నారు.పరీక్ష కేంద్రంలోకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల ప్రకారం అభ్యర్థులు వ్యవహరించాలని, మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్స్ వస్తువులతో రాకూడదని,పరీక్షలు జరుగు కేంద్రాల వద్ద 144, సెక్షన్ విధించి, రక్షణ చర్యలు తీసుకుని ఆ ప్రాంతంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయడం జరుగుతుందని తెలిపారు.పరీక్షా కేంద్రాలలో విద్యుత్ సదుపాయం సరిచూసుకోవాలని, టాయిలెట్స్, త్రాగునీరు, అన్ని మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత సెంటర్ నిర్వాహకులకు సూచించారు.పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.విద్యుత్ అంతరాయం రాకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.కేంద్రాల వద్ద సానిటేషన్ నిర్వహించాలని, పరీక్షలు జరిగే సమయాలలో అభ్యర్థుల సౌకర్యార్థం బస్సుల సమయాలను మార్చాలని సూచించారు.సమావేశం లో అదనపు ఎస్పీ టి వి. హనుమంత రావు, అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్ డి ఓ వాసు చంద్ర, పబ్లిక్ సర్వీస్ రీజినల్ కోఆర్డినేటర్ లు నరేంద్ర కుమార్, అరవింద్ రెడ్డి, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నెమత్ హాలీ, తహసీల్దర్లు, గ్రూప్ 2, పరీక్షల ప్రత్యేక అధికారులు, చీప్ సూపర్డెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.తేదీ 16-12-2024 నాడు గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యం లో అధికారులు పరీక్ష విధులకు హాజరువుతున్నందున సోమవారం (16) న జరిగే ప్రజావాణి రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.