---Advertisement---

గ్రూప్-2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

---Advertisement---

గ్రూప్-2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

తెలంగాణ కెరటం పటాన్ చెరువు ప్రతినిధి డిసెంబర్ 10:

సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్ లు, రూట్ ఆఫీసర్స్, ఇన్విజిజిలేటర్ లతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.జిల్లాలో డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు 30 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వికారాబాద్ రీజినల్ పరిదిలో 19, తాండూర్ రీజినల్ లో l1 పరీక్ష కేంద్రాలలో మొత్తం *10381* మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. వికారాబాద్ మండలంలో 14 పరీక్ష కేంద్రాలు, పూడూరు మండలం 1, పరిగి మండలం 4 పరీక్ష కేంద్రాల్లో అదేవిధంగా తాండూర్ మండలంలో 11 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇన్విజిలేటర్ లు, శాఖపరమైన అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష పత్రాలను తీసుకువెళ్లేందుకు బందోబస్తు, ఎస్కార్ట్ల ఏర్పాట్లను చూసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విదించనున్నట్లు ఆయన తెలిపారు.సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అదనపు ఎస్పీ టీ.వీ. హనుమంతరావు, ఆర్డీఓ వాసు చంద్ర, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీజినల్ కోఆర్డినేటర్ లు డాక్టర్ నరేంద్ర కుమార్, అరవింద్ రెడ్డి, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నేమత్ అలీ లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment