డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతం చేయాలి.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి నవంబర్ 30:
స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని శనివారం అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు సంబంధిత వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు,మండల, గ్రామ ప్రత్యేక అధికారులతో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల నిర్వహణ కార్యక్రమాన్ని సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహించే ప్రజాపాలన ,ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అన్ని మండల కార్యాలయాల్లో ప్రభుత్వ లోగో ఏర్పాటు చేసుకోవాలని, అన్ని కార్యాలయాలు పరిశుభ్రత పాటించాలని, విద్యుత్ దీపాలతో అలంకరించాలని, ఆయా శాఖల వారీగా విజయ గాధలను ఇవ్వాలని సూచించారు. డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో గ్రామ స్థాయిలో, 10 నుంచి 11వ తేదీల మండల స్థాయిలో, 16-21 వరకు జిల్లా స్థాయిలో సీఎం కప్ ఆటల పోటీలు నిర్వహించాలని, ఆ తదుపరి నెగ్గిన ఆటగాళ్లను రాష్ట్ర స్థాయికి పంపించాలని, ఈ మేరకు పాఠశాలల పీఈటీల సహకారంతో ఈ పోటీలను విజయవంతం చేయాలని సూచించారు.
కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తదితరులు పాల్గొన్నారు.