ప్రైవేట్ ఆస్పత్రులను సందర్శించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని.

ప్రైవేట్ ఆస్పత్రులను సందర్శించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 27):

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర హాస్పిటల్, గాయత్రి హాస్పిటల్ ను జిల్లా మరియు వైద్యశాఖ అధికారిణి డాక్టర్ కె. వి. స్వరాజ్యలక్ష్మి శుక్రవారం సందర్శించి విచారణ చేశారు. ఈనెల 25 తారీఖున నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మరణించిన తెలకపల్లి మండలం ఆలేరు గ్రామానికి చెందిన గర్భవతి రాములమ్మ మృతికి కారణాల విషయమై విచారణ చేపట్టారు. గర్భవతి ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చిన సమయము, ఆరోగ్యస్థాయి, చేసిన పరీక్షలు మరియు చికిత్స, మందుల వివరాలు, నమోదు చేసిన రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ప్రైవేట్ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సేవలు, చికిత్సలు, ఫీజులను,ల్యాబ్ పరీక్షలు, రోగుల రికార్డులను, వార్డులను, పరిశుభ్రతను పరిశీలించారు.గర్భవతి రాములమ్మకు చికిత్స నందించిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యానికి నోటీసులను ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పై ప్రైవేట్ ఆస్పత్రుల డిపిఓ హెచ్ ఈ ఓ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment