---Advertisement---

డ్రగ్స్, గంజాయి చాక్లెట్లు వాడే వారిపై జిల్లావ్యాప్తంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా విస్తృతస్థాయిలో కమిటీలు.

---Advertisement---

డ్రగ్స్, గంజాయి చాక్లెట్లు వాడే వారిపై జిల్లావ్యాప్తంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా విస్తృతస్థాయిలో కమిటీలు.

జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడి.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి నవంబర్ 29:

జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా సుమారు 19 లక్షల ,86,750/- రూపాయల విలువ గల ఆల్ప్రాజోలం 3 కిలోల 988 గ్రాములు, ఎండు గంజాయి 455.293 -కిలోల, గంజాయి చాక్లెట్లు 33 కిలోల 450 గ్రాములు దహనం. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్. పోలీసుల ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు.జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన 12 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత ఆల్ప్రాజోలం 3 కిలోల 988 గ్రాములు, ఎండు గంజాయి 455.293 -కిలోలను,గంజాయి చాక్లెట్లు 33 కిలోల 450 గ్రాములు యన్.డి.పి.యస్.చట్ట ప్రకారం న్యాయస్థాన అనుమతి తీసుకుని,న్యాయాధిపతుల ముందు కేసు ప్రాపర్టీని యఫ్.యస్.ఎల్. కొరకు శాంపిల్ తీసి మిగిలిన మొత్తాన్ని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు తేది: 29.11.2024 నాడు సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలలోని మెడీకేర్ పరిశ్రమలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేయడం జరిగిందని,దహనం చేసిన నిషేధిత ఆల్ప్రాజోలం, గంజాయి, గంజాయి చాక్లెట్లు విలువ సుమారు 19 లక్షల ,86,750/- రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వివరించారు.జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, కమిటీ సభ్యులైన అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్ సాయుధ ధల డిఎస్పీ రంగ నాయక్,డీసీఆర్బీ సిఐ మధు సూదన్ గౌడ్,మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి,మెడీకేర్ పరిశ్రమ మేనేజర్ శివారెడ్డి ఆధ్వర్యంలో ఇట్టి దహనం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యన్.డి.పి.యస్. యాక్ట్ లోని నియమ నిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదు చేయనడిన 12 కేసులలో నిల్వ ఉన్న ఆల్ఫాజోలం మరియు గంజాయి,గంజాయి చాక్లెట్లు శుక్రవారం దహనం చేయడం జరిగిందని తెలియజేసారు. కొందరు అక్రమార్జనలో భాగంగా అక్రమ ఆల్ప్రాజోలం తయారీ,గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారన్నారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై మత్తుకు బానిసలై గంజాయి లాంటి మత్తు పదార్ధాలను సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment